దేవర ఈవెంట్ రద్ధుకు కారణం రేవంత్ సర్కారే

 దేవర ఈవెంట్ రద్ధుకు కారణం రేవంత్ సర్కారే

CM Revanth Reddy

ఇటీవల నోవాటెల్ హోటల్ లో జరగాల్సిన దేవర మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్ధైన సంగతి విధితమే. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైపల్యం వల్లనే రద్ధు అయిందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

ఈ రోజు ఆయన నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మాజీ మంత్రుల బృందం హైడ్రా బాధితులను పరామర్శించడానికెళ్లారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ” గత పదేండ్లలో హైదరాబాద్ లో ఏ కార్యక్రమం జరిగిన కానీ ఎలాంటి సమస్యలు.. ఇబ్బందుల్లేకుండా జరిగింది..

కానీ కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ లో అనేక విధ్వంస కార్యక్రమాలు జరిగాయి.. అందులో భాగంగా దేవర ఈవెంట్ రద్ధు అయింది.. ఓపెన్ ఈవెంట్ పెట్టుకుంటామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతివ్వలేదు.. నోవాటెల్ హోటల్ లో భద్రతలు చేపట్టలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. పదేండ్లలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడైన విన్నామా.. చూశామా అని ఆయన అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *