బాబు ట్రాప్ లో జగన్ చిక్కుకుంటాడా .. ?
రాజును కొట్టాలంటే రాజు చుట్టూ ఉన్న సైన్యాన్ని దెబ్బ తీయాలి.. ఇది రాజనీతి కూడా… అందుకే యుద్ధం జరిగే సమయాల్లో ముందు సైన్యాన్ని దెబ్బ తీస్తారు.. ఆ తర్వాత రాజును అంతమొందించడానికి ప్రయత్నం చేస్తారు. రాజకీయాల్లో అయితే ఓ పార్టీని నాశనం చేయాలంటే ముందు ఆ పార్టీలో ఉన్న మోస్ట్ పవర్ ఫుల్ నాయకులను లాక్కోవాలి.. ఆ తర్వాత ఆ పార్టీ అధినాయకుడ్ని ముప్పై తిప్పలు పెట్టాలి .. ఇది నేటి రాజకీయాల్లో మనం చూస్తున్న సంఘటనలు.. దీనికి చంద్రబాబు ఏమి తక్కువ కాదు అని అంటారు రాజకీయ విశ్లేషకులు.. తాను అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఏకంగా చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారు. పవన్ కళ్యాణ్ ను నడిరోడ్డుపై పడుకోబెట్టారు.. మరోవైపు లోకేశ్ ను తండ్రిని కలవకుండా అడ్డుపడ్డారు. ఇవే జగన్ ఓటమికి ప్రధాన పునాదులయ్యాయని రాజకీయ విమర్శకుల టాక్.
జరిగిపోయిన దాన్ని ముందుకు తీసుకెళ్లలేము.. జరిగబోయేది ఎలాగు మన చేతుల్లో ఉండదు. ప్రస్తుతం జరిగేది మాత్రమే మనపై.. మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది అని జగమెరిగిన సత్యం.. ఈ సూత్రం వైసీపీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి పక్కగా సరిపోతుంది. అధికారం కోల్పోయాక జగన్ తన తీరు ఏమి మార్చుకోలేదని పలు సంఘటనలతో అది నిరూపితమైంది. జగన్ కొట్టాలంటే ఆర్ధికంగా బాబు ఢీకొట్టలేరు. ఇది ఆయనకు తెల్సు.. అందుకే ముందుగా ఆయన వ్యక్తిత్వాన్ని ఆ పార్టీ పునాదులను లక్ష్యంగా చేసుకున్నారు అని అందరూ అంటుంటారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే నాలుగు వందల మంది వైసీపీ నేతల.. కార్యకర్తల.. సానుభూతిపరులపై దాడులు జరిగాయి అని ఏకంగా జగనే సేవ్ ఆంధ్రా పేరుతో ఢిల్లీలో ధర్నాకు దిగడం అప్పట్లోనే పెనుసంచలనమైంది.. ఆ సమయంలోనే పోలవరం డ్యామ్ కొట్టుకుపోయిందని బాబు తన అనుకూల మీడియా ద్వారా జనాల్లోకి జగన్ చేసిన ధర్నాను పోనీవ్వకుండా పోలవరం ఇష్యూ జగన్ చేతకానితనం వల్లనే జరిగిందనే ప్రచారాన్ని లోతుగా తీసుకెళ్లారు.
ఆ తర్వాత జైత్వానీ అనే హీరోయిన్ ఇష్యూ.. ఆ తర్వాత బోట్ల వివాదం.. తాజాగా తిరుపతి లడ్డూ వివాదాన్ని ముందరేశారు బాబు & బ్యాచ్. తిరుపతి లడ్డూ ఇష్యూలో నిజంగా అది కల్తీ జరిగినట్లు ప్రూవ్ అయితే వాళ్ళు జగన్ తరపునే కాదు బాబు తరపున ఉన్న సరే నిందితులకు తప్పకుండా శిక్ష పడాల్సిందే. ఎందుకంటే తిరుపతి లడ్డూ అంటే కేవలం ప్రసాదమే కాదు కోట్లాది మంది హిందువుల మనోభావాలకు .. నమ్మకానికి ప్రతీక.. దాదాపు మూడున్నర వేల మెట్లు ఎక్కి వెంకన్నస్వామిని దర్శించుకుని చివర్లో ఆ ప్రసాదం తీసుకుంటే వచ్చే కిక్కే వేరు.. ఆ ప్రసాదం సాక్షాత్తు ఆ వెంకన్న స్వామే తమకు ఇచ్చినట్లుగా భక్తులు భావిస్తారు. అంతటి మహా ప్రాధాన్యత ఉంటుంది దానికి. అయితే లడ్డూ కల్తీ అయిందని ఇటు కూటమి ప్రభుత్వం అటు బాబు అనుకూల మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పక్కనెడితే జగన్ ముందు చేయాల్సింది దానిపై తానే సీబీఐ విచారణ కోరుతున్నట్లు కేంద్రాన్ని డిమాండ్ చేయచ్చు..
అవసరమైతే ఢిల్లీకెళ్లి సాక్షాత్తు ప్రధానమంత్రి తో సహా రాష్ట్రపతిని కూడా కోరవచ్చు రాష్ట్రస్థాయిలో తాను పోకూడదనుకుంటే..?. అంతే కానీ జగన్ ఎంతగా లోకల్ గా అరిచి గీ పెట్టిన ఇప్పటివరకు జరిగిన తనపై అసత్య ప్రచారం లెక్క ఉంటది తప్పా ఏది నిజమో.. కాదో ఇటు వీళ్లకు… అటు ప్రజలకు తెల్సే అవకాశం ఉండకపోవచ్చు.. ఎందుకంటే మంచి కంటే చెడే నమ్మే రోజులివి. అందుకే బాబు ట్రాఫ్ లో పడకుండా ఉండటానికి జగన్ ముందు చేయాల్సిన పని తనచుట్టూ ఉన్నవాళ్లలో ఎక్కువగా తెలివైన.. అప్దేట్ వర్శన్ వ్యక్తులను పెట్టుకుంటే మంచిదని… బాబు ట్రాఫ్ లో జగన్ చిక్కుకుంటాడా.. బయటపడి పూర్వపు జగన్ ను పరిచయం చేస్తాడా అనేది కాలమే నిర్ణయించాలని రాజకీయ విమర్శకులు చెబుతున్నారు.