రాజీవ్ గాంధీ విగ్రహాం వెనక అసలు కథ ఇదేనా ..?- ఎడిటోరియల్ కాలమ్

 రాజీవ్ గాంధీ విగ్రహాం వెనక  అసలు కథ ఇదేనా ..?- ఎడిటోరియల్ కాలమ్

Rajiv Gandhi Statue

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఎదురుగా దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎంతో అట్టహాసంగా ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నెహ్రూ నుండి ఇందిర గాంధీ .. రాజీవ్ గాంధీ .. అందరూ దేశం కోసం ప్రాణాలర్పించారు. వారి సేవలు మరువలేనిది. వారు దేశానికి ఎంతగానో చేశారు. కేసీఆర్ కుటుంబం ఏమి చేసింది.. తెలంగాణ వచ్చాక పదవులను అనుభవించారు అని ఆయన ఆరోపించిన సంగతి విధితమే.

కేసీఆర్ కుటుంబం తెలంగాణ కోసం ఏమి చేసిందన్నది కండ్ల ముందు కదలాడే చరిత్ర.. భావి తరాలు తెలుసుకోవాల్సిన నిజం.. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహాం పెట్టాల్సిన చోట సడన్ గా దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాం పెట్టాల్సినవసరం ఏమోచ్చింది. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు స్పందిస్తూ ఢిల్లీలో సోనియా గాంధీ,రాహుల్ గాంధీల మెప్పుకోసమే రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటును ముందరేసుకున్నారు అని ఆరోపించారు.

అప్పుడైన ఇప్పుడైన ఎప్పుడైన కాంగ్రెస్ నుండి ఎవరూ పదవులు కావాలన్నా .. పదవుల్లో ఉన్న సరే ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తారు.. ఆ ప్రయత్నాల్లో భాగంగానే రేవంత్ రెడ్డి తెలంగాణ వాదుల మనోభావాలను దెబ్బ తీస్తూ తెలంగాణ తల్లి విగ్రహాం పెట్టాల్సిన చోట రాజీవ్ విగ్రహాం పెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజీవ్ గాంధీ అన్ని రాష్ట్రాలకు మాదిరిగా అప్పటి ఉమ్మడి ఏపీకి కూడా పీఎం.. ఆయన రాజకీయంగా కానీ అధికారకంగా చేసిన సేవలు అనిర్వచనీయం.. వారిని ఎవరూ తప్పపట్టరు.. పట్టలేరు కూడా..

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఒకసారి పరిశీలిస్తే నెహ్రూ పదవిలో ఉండగా హార్ట్ అటాక్ తో చనిపోయారు.. ఆ తర్వాత ప్రధాని పదవి బాధ్యతలు చేపట్టిన ఇందిరా గాంధీ మరణం కథ అందరికి తెల్సిందే. ఇక ఆతర్వాత ప్రధాని అయిన రాజీవ్ గాంధీ శ్రీలంక దేశపు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతో లిబరేషన్ ఆఫ్ టైగర్స్ తమిళ ఈలం ఏర్పాటు వాదులు హత్య చేశారు. ఇందులో దేశం కోసం నెహ్రొ కానీ రాజీవ్ గాంధీ కానీ ప్రాణాలర్పించడం ఏముందని ఇటు తెలంగాణ వాదులు, అటు రాజకీయ విమర్శకులు విమర్శలు చేస్తున్నారు.

కానీ వాస్తవానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన సీఎం అంజయ్యను రాజీవ్ గాంధీ ఘోరంగా అవమానించారు అని అప్పటి తరం వారు .. సీనియర్ జర్నలిస్టులు చెబుతుంటారు.. సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవడానికి అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మొదలు మాజీ సీఎం దివంగత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వరకు అందరూ పథకాల పేర్లకు నెహ్రూ, రాజీవ్, ఇందిరాగాంధీల పేర్లు పెట్టడమో.ప్రాజెక్టులకు పేర్లు పెట్టడమో . వారి విగ్రహాలు పెట్టడమో చేసేవారు. తాజాగా రేవంత్ రెడ్డి అదే దారిలో నడిచారు అంతే తప్పా వేరేది ఏమి లేదు అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

తెలంగాణ తల్లి అక్కడ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించకపోతేనో. పక్కన అమరవీరుల స్మారక జ్యోతి లేకపోతేనో ఎవరూ తప్పు పట్టకపోదురు. ఎందుకంటే తెలంగాణను ఆంధ్రాలో కల్పింది కాంగ్రెస్.. కొన్ని వందల మంది బలిదానాలకు కారణమైంది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలంగాణ వాదుల ఆవేదన.. కాదు కూడదు అనుకుంటే పెట్టుకోవాలనుకుంటే గాంధీ భవన్ లో పెట్టుకోవచ్చుగా … లేదా సచివాలయం ముందు అయితే ఇంకా ఎక్కడైన పెట్టుకోవచ్చుగా అని తెలంగాణ వాదులు,విశ్లేషకులతో పాటుగా బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న వాదన..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *