MLA లు బజారునపడి కొట్టుకోవడం హేయం – భట్టీ సంచలన వ్యాఖ్యలు
మల్లు భట్టి విక్రమార్క చూడటానికి పంచెకట్టు.. సైడ్ కు దువ్విన హెయిర్ స్టైల్.. పల్లెటూరి రైతు మాదిరిగా కన్పించే బాడీ స్టైల్ .. ఏ అంశంపైన అయిన సరే అచుతూచి మాట్లాడే తత్వం తన సొంతం. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉన్న కానీ అందరూ భట్టన్న. అని భట్టి గారు మాకు మిత్రుడంటూ కేసీఆర్ సైతం అసెంబ్లీలో పలు చర్చల్లో అన్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే రాజకీయాల్లో అజాతశత్రువులెక్క ఉంటారు.
తాజాగా అరికెలపూడి గాంధీ,పాడి కౌశిక్ రెడ్డి వివాదంపై భట్టి తనదైన శైలీలో స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” మేము సఫరేట్ .. గత పదేండ్లలో బీఆర్ఎస్ వ్యవహరించినట్లుగా మేము వ్యవహరించము.. ప్రతిపక్షాల గొంతును మేము నొక్కము.. అందుకే అసెంబ్లీలో వాళ్ళకు మాట్లాడేందుకు మైకు ఇచ్చాము. పదేండ్లలో మమ్మల్ని మాట్లాడనివ్వలేదు. అఖరికి మా ఎల్పీని వాళ్లలో విలీనం చేసుకున్నారు. మేము చేసుకోము.. అలా చేయము అని తేల్చి చెప్పారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నుకొన్న ఎమ్మెల్యేలు ప్రజల కోసం.. ప్రజలసమస్యల కోసం రోడ్లపైకి రావాలి . కానీ వ్యక్తిగత పంచాయితీలతో బజారున పడోద్దు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటివార్ని అయిన సహించబోము.. మా ప్రభుత్వాన్ని అస్థిర పరిచే చర్యలకు పాల్పడేవార్ని ఎవర్ని వదలిపెట్టము. ఇద్దరు ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరును నేను హార్శించను. ఇలాంటి వారి పట్ల చట్టం ప్రకారం చర్యలుంటాయని మరోకసారి తనదైన శైలీలో స్పందించారు భట్టి.