నాడు మహిళలకు గౌరవం.. నేడు అవమానమా..?
తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలన్నీ చీరలు.. గాజుల అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలి.. మళ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై బరిలోకి దిగి గెలవాలి.. లేకపోతే మీరు మగాళ్ళు కానట్లు.. మీకు చీరలు గాజులు పంపుతా ఇవి వేస్కోండి లైవ్ లో వాటిని ప్రదర్శించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై ఇటు ఎమ్మెల్యే అరికెల పూడి గాంధీ తన అనుచురులంతా కల్సి ఎమ్మెల్యే పాడి ఇంటిపైకి దాడులకు దిగారు.
అల్మోస్ట్ ఓ ఫ్యాక్షన్ మూవీలో సీన్ లెక్క క్రియేట్ చేశారు అని బీఆర్ఎస్ శ్రేణులు,తెలంగాణ వాదులు విమర్షలు. మరోవైపు రాష్ట్ర మహిళ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత , అధికార ప్రతినిధులు భవాని రెడ్డి , సంధ్యారెడ్డి లు గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ . మహిళలంటే అంత లోకువ.. మహిళలు అంటే చేతకానివాళ్లా..?. మహిళల గురించి మరోక్కసారి తక్కువ చేసి మాట్లాడితే తమ కాళ్లకున్న చెప్పులను తీసి మరి చూపిస్తూ కొడతామని వార్నింగ్ ఇవ్వడమే కాదు ఏకంగా తెలంగాణ భవన్ కెళ్లి పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టారు.
దీంతో గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళ నేతలు ప్రస్తుత ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ,రవళి మాట్లాడుతూ అప్పటి పీసీసీ చీఫ్ ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఢిల్లీవెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మంత్రులు తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని కేంద్రంతో కొనుగోలు చేయించలేకపోయారు. మీరు మగాళ్ళు కాదు.. మీకు చేతకాదు . అందుకే మేము మీఅందరికి చీరలు ,గాజులు పంపుతున్నాము.. వీటిని వేసుకోండి మీడియాకు చూపించిన వీడియోలను ఫోటోలను బీఆర్ఎస్ శ్రేణులు,నెటిజన్లు,మహిళా వాదులు వైరల్ చేస్తున్నారు.
వీటిని చూపిస్తూ అప్పుడు మీరు మాట్లాడిన మాటలు మహిళలకు గౌరవం తెచ్చేలా ఉన్నాయి..మరోవైపు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్ధేశించి చీర కట్టుకోని ఫ్రీ బస్సెక్కు.. అన్నప్పుడు మహిళలకు డబ్బులేక ఫ్రీ బస్సెక్కుతున్నారా..?. సాక్షాత్తు నిండు సభలో మంత్రులు ముఖ్యమంత్రి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఏముఖం పెట్టుకుని సభలోకి వచ్చారు.. అక్కలను నమ్మితే జేబీఎస్ లో అడుక్కోవడమే అని అన్నప్పుడు మహిళలను అవమానించినట్లు కాదు.
ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి మాటలు అవమానించేలా ఉన్నాయా..?. తక్కువగా చేసి చూపించేలా ఉన్నాయా అని ?. విరుచుకుపడుతున్నారు. రాజకీయంలో ఇలాంటి వ్యాఖ్యలు సహాజమే అయిన కానీ వీటీని భూతద్ధంతో చూసి ఇష్యూ ను డైవర్ట్ చేయడానికి.. హామీల అమలను పక్కతోవ పట్టించడానికే కాంగ్రెస్ శ్రేణులు, మహిళ నేతలు బీఆర్ఎస్ పై డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు అని వారు విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో మాట్లాడే ముందు.. ఏదైన పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి.. చేయాలని వారు సూచిస్తున్నారు.