బండి సంజయ్ కు డౌటోచ్చింది

Bandi Sanjay
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు విచిత్రమైన డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి .. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ” రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ తప్పుగా మాట్లాడటం రాజ్యాంగాన్నే అవమానించినట్లు. రిజర్వేషన్లు తీసేయాలనే కాంగ్రెస్ చూస్తుంది. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అన్నారు .
ఇంతవరకూ బాగానే ఉన్నా మరో మెట్టు ఎక్కి బండి సంజయ్ మాట్లాడుతూ ” రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి సర్కారు జైల్లో వేయలేకపోతున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయడం ఆయనకు చేతకావడం లేదు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడి వచ్చారు. వచ్చిన దగ్గర నుండి కేసీఆర్ & కుటుంబం పై రాజకీయ విమర్షలు తప్పా పదేండ్లు అవినీతి అక్రమాలు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు అనే అనుమాన్ని వ్యక్తం చేశారు.
బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు స్పందిస్తూ సెటైర్లు వేస్తున్నారు. పదేండ్లు అవినీతి అక్రమాలు చేస్తే పదేండ్లు అధికారంలో ఉన్నది మీ బీజేపీ కదా.. అప్పుడు మీరు బీజేపీ అధ్యక్షుడు. ఎంపీ. కేంద్రంలో ఉన్న మీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తే కోర్టులు చీవాట్లు పెట్టిన మీకు కనువిప్పు కలగడం లేదా బండి.
వరదలతో ఆగమైన బాధితుల కోసం కేంద్రం నుండి ఏమి తెస్తావో చెప్పకుండా.. రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుందో ప్రశ్నించకుండా.. నిత్యం కేసీఆర్ కుటుంబం పై పడి ఏడుస్తున్నావు. మీరు కాంగ్రెస్ కుమ్మకవ్వడం వాస్తవం కాదా.. ప్రజలకు వాస్తవాలు ఏంటో తెలుసు.. మీ డౌటానుమానాలు మానేసి మిమ్మల్ని గెలిపించిన కరీంనగర్ ప్రజలకు.. తెలంగాణకు పైసా పని చేయండి అని సెటైర్లు వేస్తున్నారు.