తగ్గేదేలే అంటున్న రేవంత్ రెడ్డి..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తగ్గేదేలే అంటున్నారు. రాష్ట్ర పోలీస్ అకాడమీలో క్రీడా భవన్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” హైదరాబాద్ మహానగరంలో చెరువులను, ప్రభుత్వభూములను ఆక్రమించిన వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. బఫర్,FTL జోన్ల పరిధిలో పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్న నిర్మించుకున్న అక్రమణ దారులను ఎవర్ని వదిలి పెట్టే ప్రసక్తి లేదు.
వాళ్లు ఎంత పెద్దవారైన సరే.. ఎంతటి వారైన సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు.. న్యాయస్థానాలకెళ్లి స్టేలు తెచ్చుకున్న కానీ ప్రభుత్వం పోరాడి అయిన ఆ స్టేలపై వెకెంట్ చేయించి మరి అక్రమ నిర్మాణాలను కట్టడాలను కూల్చి వేసి ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించే వరకు నిద్రపోను.. అదే నా ప్రభుత్వ ముఖ్య లక్ష్యం . హైడ్రా నుండి నానుండి ఎవరూ తప్పించుకోలేరు అని వార్నింగ్ ఇచ్చారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో బఫర్, FTL జోన్ల పరిధిలో ఎవరైన అక్రమణలకు పాల్పడితే వారు అంతగా వారే స్వయంగా దూరంగా వెళ్లి నిర్మించుకోండి. ఎప్పటికైన సరే అక్రమ నిర్మాణాలు ,భవనాలు కూల్చివేయడం ఖాయం.. మూసీ పరివాహకంలో శాశ్వత నివాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లను ఇచ్చే బాధ్యత నేను.. నా ప్రభుత్వం తీసుకుంటుంది. అక్రమణ దారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అన్నారు.