జగన్ కుట్రను బయట పెట్టిన బాబు

Chandrababu andhrapradesh CM
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు గత రెండు వారాలుగా విజయవాడ వరద బాధితుల కోసం క్షేత్రస్థాయిలో ఉంటూ పునరవాస కార్యక్రమాలు అందజేత.. బుడమేరు వాగు గండి పూడిక.. విజయవాడ వరద బాధితులకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పన లాంటి తదితర కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటున్న సంగతి తెల్సిందే. ఒక పక్క ప్రజలకు ఏమవసరమో తీరుస్తూనే మరోవైపు సందు దొరికింది కదా అని మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై విమర్షనాస్త్రాలను వదులుతున్నారు చంద్రబాబు.
ఆయన మీడియాతో మాట్లాడూతూ ” ప్రకాశం బ్యారెజ్ ను కూల్చివేయడానికి మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కుట్రలు చేశారు. ప్రకాశం బ్యారేజ్ ను ఢీకొట్టిన బోట్లు వైసీపీ పార్టీకి చెందిన నేతలకు సంబంధించినవే అని సంచలన ఆరోపణలు చేశారు. బుడమేరు వాగుకు గండి పెట్టింది కూడా వైసీపీ నేతలే అని అన్నారు.
ఇలాంటి వాళ్లను ఏమి చేయాలి..?. ప్రజలంతా ఆలోచించుకోవాలి..?. తిరిగి మనపైనే విషం చిమ్ముతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఓడించారనే ఇలాంటి కుట్రలకు తెరతీస్తున్నారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. బాధితులను పరామర్శించడానికి వచ్చిన జగన్ ఒక్క పుడ్ ఫ్యాకెట్ అయిన ఇచ్చారా అని ఆయన మండిపడ్డారు.