తెలంగాణలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులా…?
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు.. అక్రమ కేసులు పెడుతున్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసీ మహిళ పై జరిగిన అత్యాచార హత్య యత్నంపై బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్.. గత ప్రభుత్వంలో ప్రభుత్వ డిజిటల్ హెడ్ గా పని చేసిన తెలంగాణ ఉద్యమ కారుడు.. తెలంగాణ వాది కొణతం దిలీప్ ను ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు..
ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా హైదరాబాద్ మహానగరంలో ఆయన ఇంటి నుండి పోలీసులు తీసుకెళ్లారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి,బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,మన్నె క్రిషాంక్ ,ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు సీసీఎస్ కు వెళ్లారు. అక్కడ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ” ప్రజాపాలన అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు..
ఎఫ్ఐఆర్ లేకుండా పోలీసులే కాళేశ్వరం తో నీళ్లను లిఫ్ట్ చేసినట్లు ప్రభుత్వం పోలీసులతో బీఆర్ఎస్ నాయకులను,కార్యకర్తలను లిఫ్టింగ్ చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. మొన్న ఖమ్మం వరద బాధితుల్లో ఒక యువతి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆ యువతిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు .. గతంలో కూడా మా పార్టీ నాయకుడు క్రిషాంక్ మన్నెను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇదే దిలీప్ కొణతం ను అరెస్ట్ చేస్తే హైకోర్టులో మొట్టికాయలు పడ్డాయి. అయిన తీరు మార్చుకోకుండా ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు.