KCR రూ.2000కోట్లివ్వాలి -సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Telangana Cm
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి.. వరదలతో ఆగమైన బాధితుల సహాయర్ధం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ కింద రెండు వేల కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మీడియా చిట్ ఛాట్ లో తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” గతంలో వరదలు వచ్చిన సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదు..
మేము అలా కాదు . మాది చేతల ప్రభుత్వం.. మాటల ప్రభుత్వం కాదు. ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ఇస్తాము.. వరదల్లో మృతిచెందిన వారికి ఐదు లక్షలు ఇస్తాము అని అన్నారు. తక్షణ సాయం కింద ఖమ్మం సూర్యాపేట భద్రాచలం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్లకు ఐదు కోట్లు చొప్పున నిధులు విడుదల చేశాము.
వరదలతో ఐదు వేల మూడోందల ఎనబై నాలుగు కోట్ల రూపాయల నష్టం చేకూరింది. ఖమ్మం విపత్తును జాతీయ విపత్తు కింద గుర్తించాలని కేంద్రాన్ని కోరాము.. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ తెలంగాణలో పర్యటించాలని కోరాను. పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశాము. అంటు వ్యాధులు ప్రభలకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాము అని ఆయన పేర్కొన్నారు.