అరెస్ట్ To విడుదల -కవిత పై Special Video
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బైయిల్ పై బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత నిన్న మంగళవారం విడుదల అయిన సంగతి తెల్సిందే. దీంతో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఓ వీడియో పంచుకుంది.
‘నేను KCR బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు. నన్ను అక్రమంగా జైల్లో పెట్టినోళ్లకు తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తా’ అని కవిత చేసిన కామెంట్లను ఆ పార్టీ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
అరెస్ట్ నాటి నుంచి విడుదలయ్యే వరకూ వీడియోలో ఉంది. అటు ఆ పార్టీ సపోర్టర్లు సైతం సోషల్ మీడియాలో కవితకు మద్దతుగా పోస్టులు చేస్తున్నారు.