ఎక్కువగా పారాసిటమాల్ వేసుకుంటున్నారా..?
సహాజంగా కొంచెం జ్వరంగా ఉన్నా… కొద్దిగా తలనొప్పి ఉన్నా కానీ.. జలుబు చేసిన కానీ మనం ఎక్కువగా పారాసిటమాల్ కే ప్రయార్టీ ఇస్తాము.. వైద్యుల కంటే ముందే మనం దాన్ని తీసుకోవడం వేసుకోవడం రెండు జరిగిపోతాయి కూడా.
అంతగా మనం పారాసిటమాల్ కు ఎక్కువ ప్రయార్టీ ఇస్తాము. అయితే ఎక్కువగా ఈ టాబ్లెట్ వాడితే కాలేయం పై ఎక్కువ ప్రభావం చూపుతుంది అని వైద్య నిపుణులు తెలుప్తున్నారు.
పెద్దలు రోజుకూ గరిష్టంగా నాలుగు గ్రాములను మించి ఈ టాబ్లెట్లను వాడకూడదని చెబుతున్నారు. అంటే రోజుకు రెండు కంటే ఎక్కువగా తీసుకోవద్దు . అది కూడా వైద్యుల సలహాతోనే వాడాలని వారు అంటున్నారు.