జన్వాడ ఫామ్ హౌస్ కు ఇరిగేషన్ అధికారులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో అక్రమణలకు గురైన చెరువులు.. ప్రభుత్వ భూముల పరిరక్షణకోసం ఏర్పాటైన “హైడ్రా” సంస్థ దూకుడును పెంచింది. తాజాగా జన్వాడ ఫామ్ హౌస్ లో ఇరిగేషన్ ,రెవిన్యూ అధికారులు ప్రత్యేక్షమయ్యారు.
ఇందులో భాగంగా ఇరిగేషన్ అధికారులు ఫామ్ హౌస్ లో కొలతలు మొదలెట్టారు.. FTL, బఫర్ జోన్ పరిధిలో ఉన్నాదా.. ?. లేదా అనే కోణంలో ఫామ్ హౌస్ కొలతలను ఇరిగేషన్ అధికారులు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఫామ్ హౌస్ మాజీ మంత్రి కేటీఆర్ కు చెందినదిగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించిన సంగతి తెల్సిందే.
ఈ ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదు.. తన స్నేహితుడుది . అతని దగ్గర లీజుకు తీసుకున్నాను అని క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా ఇరిగేషన్ రెవిన్యూ అధికారులు ఈ ఫామ్ హౌస్ లో ప్రత్యేక్షమవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.