ఫామ్ హౌస్ పై మాజీ Mp మధుయాష్కీ క్లారిటీ

Former Mp Madhu Goud Yaskhi
కాంగ్రెస్ మాజీ ఎంపీ.. సీనియర్ నేత మధుయాష్కీకి గండికోట చెరువు సమీపంలో ఉన్న ఫామ్ హౌస్ ఇటు బఫర్ జోన్.. అటు FTL పరిధిలో ఉంది. ముందు వాళ్లవి కూల్చివేసి సామాన్యుల జోలికి వెళ్లాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇటీవల ఆరోపించిన సంగతి తెల్సిందే. తన ఫామ్ హౌస్ పై వస్తున్న వార్తలపై మాజీ ఎంపీ మధుయాష్కీ స్పందించారు.
FTL, బఫర్ జోన్ లో తనకు ఫామ్ హౌస్ ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించిన మాటల్లో ఎలాంటి వాస్తవం లేదు. గండికోట చెరువు దగ్గర నాకు పండ్ల తోట ఉన్నమాట నిజం. ఆ తోటను చూస్తున్న కాపరి కోసం ఓ చిన్న నిర్మాణం ఉంది అంతే.
అయిన చెరువుల దగ్గర కుంటల దగ్గర తోటలను పెంచుకోవచ్చు అనే చిన్న అవగాహన లేకపోవడం బాధాకరం. ఎఫ్ టీఎల్,బఫర్ జోన్ ల పరిధిలో పండ్ల తోటలు,తోటలను సాగుచేయచ్చు అని నియమనిబంధనలే చెబుతున్నాయి. సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న ఆరేండ్లు పని చేసిన కేటీఆర్ కు ఇంత విషయం తెలియదా అని ఆయన ప్రశ్నించారు.