KTR కు రాఖీ కట్టిన కమీషన్ సభ్యులకు నోటీసులు
తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ ముందు హాజరైన మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిన్న శనివారం కమీషన్ కార్యాలయంలో రాఖీ కట్టిన కమీషన్ సభ్యులకు కమీషన్ చైర్ పర్శన్ నేరెళ్ల శారద నోటీసులు జారీ చేశారు. కమీషన్ నిష్పాక్షపాతంగా వ్యవహారించాలని ఆమె హెచ్చరించారు.
కమీషన్ కార్యాలయంలోపలకు మొబైల్స్ అనుమతి లేకపోయిన రహస్యంగా తీసుకెళ్లి రాఖీ కట్టిన వీడియోలు చిత్రీకరించడంపై చైర్ పర్శన్ శారద మండిపడ్డారు. రాఖీ కట్టిన ఆరుగురు కమీషన్ సభ్యులకు నోటీసులు ఇవ్వాలని కమీషన్ కార్యదర్శిని ఆధేశించారు.
తదుపరి చర్యలకోసం న్యాయ నిపుణుల సలహా సూచనలను తీసుకుంటున్నారు. అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు కమీషన్ చైర్ పర్శన్ శారద తెలిపారు.