బీఆర్ఎస్ లోకి 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..!

16 total views , 1 views today
ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమా..?. ఇప్పటికే పార్టీ మారి తప్పు చేశామనే ఆలోచనలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారా..?. గత పదిహేను నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారిస్తున్న తీరుతో తీవ్ర వ్యతిరేకత వస్తుందని వారు భావిస్తున్నారా..?.
ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చిన.. తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగితే డిపాజిట్లు కూడా రావనే వాళ్లకు సంకేతాలు ఉన్నాయా..?. అందుకే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలల్లో ఎనిమిది మంది వెనక్కి రావాలని చూస్తున్నారా..?.
అంటే గాంధీ భవన్ లో ఇదే చర్చ జరుగుతుంది. మంత్రి పదవులు వస్తాయానో.. కేసీఆర్ కంటే మంచిగా పాలిస్తారనో.. తమకు పనులు అవుతాయనో. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు వస్తాయనో.. కారణం ఏదైన సరే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో పది మంది ఎమ్మెల్యేలు చేరారు. చేరిన మూడు నెలలపాటు పట్టించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ఓ మంత్రి తీరా కాలం గడిచేకొద్ది పట్టించుకోవడమే మానేశారు. పదవులు సంగతి పక్కనెట్టి కనీసం నియోజకవర్గ అభివృద్ధికై నిధులు అడుగుతున్న ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ ముఖం చాటేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీలో ఇలాగే కొనసాగితే మున్ముందు తిప్పలు తప్పవని భావించిన సదరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరిగి బ్యాక్ టూ హోం అంటూ తమకు టచ్ లో ఉన్న బీఆర్ఎస్ ముఖ్య నేతల దగ్గరకు సమాచారం పంపుతున్నారంట. అన్ని అనుకున్నట్లుగానే జరిగితే జపాన్ పర్యటనకు వెళ్తున్న రేవంత్ రెడ్డి తిరిగి వచ్చేలోపు మళ్లీగులాబీ కండువా కప్పుకోవచ్చు అని గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి.
