30వేలా.. ? .65వేలా ..? -అబద్ధాల్లోనూ క్లారిటీ లేని సీఎం రేవంత్ రెడ్డి..?
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ.. ఆ పార్టీ సీనియర్ నేత బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారమహోత్సవానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే నిరుద్యోగ యువతకు అరవై ఐదు వేల ఉద్యోగాలను అందించాము” అని అన్నారు.
ఇదే ముఖ్యమంత్రి సరిగ్గా రెండు నెలల కిందట అంటే జూలై ఇరవై ఏడో తారీఖున జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మూడు నెలల్లోనే ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చాము.. కేసీఆర్ నిరుద్యోగ యువతను పట్టించుకోలేదు.. యువతను మోసం చేశారు..రాబోయే తొంబై రోజుల్లో మరో ముప్పై వేల ఉద్యోగాలను ఇస్తాము అని చెప్పారు.
తాజాగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను జూలై నెలలో మాట్లాడిన వీడియోలను పోస్టు చేస్తూ ” ముప్పై వేల ఉద్యోగాలను ఇచ్చింది మీరు కాదు. బీఆర్ఎస్ పార్టీ..ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చింది.. వాటి పరీక్షలను నిర్వహించింది బీఆర్ఎస్.. పరీక్షల ఫలితాలను వెల్లడించేసరికి అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయాయి.
మీరు అధికారంలోకి వచ్చాక ఆ ఫలితాలను వెల్లడించి మీరేదో నోటిఫికేషన్లు ఇచ్చినట్లు.. మీరే పరీక్షలు నిర్వహించినట్లు ఫేక్ ప్రచారం చేస్తూ ఎవరికో పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నట్లు ఉంది.. ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పి మూడు నెలలు కాలేదు. తాజాగా మాట్లాడుతూ అరవై ఐదు వేల ఉద్యోగాలిచ్చామంటున్నారు.. మిగతా ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు.. మీ పార్టీ ఐటీ సెల్ లోనా . కనీసం అబద్ధాలు చెప్పేటప్పుడైన క్లారిటీ లేదు కదా రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు.