రేవంత్ రెడ్డిని కల్సిన 10మంది BRS ఎమ్మెల్యేలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. అందులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ” నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్నారు.. తీరా పార్టీలోకి చేరాక సబితక్క కేసీఆర్ మాయమాటలు నమ్మి పార్టీ మారారు. నాకు అక్క తోడుగా ఉండాలి కదా.. నేను సభలో అక్క అనే అన్నాను.. వేరే భాష ఏమి ప్రయోగించలేదు.. నేను ఎవరి పేర్లను ప్రస్తావించలేదు.. మరి వాళ్లకు ఉలుకు ఎందుకు.. ?
సభలో మాజీ మంత్రి హారీష్ రావు కు 2గంటల 11నిమిషాల టైం ఇచ్చాము.. కేటీఆర్ కు 2గంటల 36నిమిషాల టైం ఇచ్చాము.. జగదీష్ రెడ్డికి 1గంట 11నిమిషాల టైం ఇచ్చాము.. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరికైన పదినిమిషాల కంటే ఎక్కువ టైం ఇచ్చారా..? అనేది వాళ్లు సమాధానం చెప్పాలి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పడానికి అయితే కేసీఆర్ ను ఫ్లోర్ లీడర్ గా తీసేయండి.. రాజకీయంగా వ్యక్తిగతంగా మాట్లాడవద్దు. నేను సునీతక్క కోసం ఎన్నికల ప్రచారానికెళ్తే నాపై రెండు కేసులు నమోదయ్యాయి..
అక్క పార్టీ మారి కమిషన్ చైర్మన్ అయ్యారు. నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాదగ్గరకు వచ్చి నన్ను కలిశారు.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్ రెడ్డి చాయ్ తాగడానికి వాళ్ల దగ్గరకెళ్లి ఉంటారు.సభలో సభ్యుల సస్పెషన్ వద్దని నిర్ణయించుకున్నాము. సభ హక్కులను ఉల్లంఘిస్తే ఎవరిపైన అయిన చర్యలు తప్పవు. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సభితక్క అని భట్టి గారు అన్నారు. అంతకు మించి సమాధానం ఏం ఉంటది” అని అన్నారు.