ఇవి తిన్నాక వెంటనే నీరు తాగొద్ధా..?
వేరుశనగను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిలో ఉండే కాల్షియం, ఐరన్, విటమిన్స్ సహా ఇతర పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పల్లీలను వేయించి, ఉడకపెట్టి తినడమే కాకుండా రకరకాల స్నాక్స్ రూపంలో తింటారు. వేరుశనగలను వేడిచేసి లేదా ఉడకపెట్టి తిన్న వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేరుశనగను తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణంకావడం కష్టంగా మారి జీర్ణప్రక్రియలో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందట. సాధారణంగా వేరుశనగ తిన్నతర్వాత జీర్ణంకావడానికి శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో నీరు తాగితే అది జీర్ణమయ్యే ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది.
ఫలితంగా అజీర్తి, గ్యాస్, కడుపులో అసౌకర్యంగా అనిపించడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అలాగే దగ్గు, గొంతు, ఛాతీపై చెడు ప్రభావం, శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగకపోవడం ఉత్తమం. దాహంగా అనిపిస్తే 10 నుంచి 15 నిమిషాలు ఆగి నీరుతాగడం మంచిది.