అల్లు అర్జున్ కు వైసీపీ మద్ధతు
పుష్ప మూవీతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన టాలీవుడ్ స్టార్ హీరో… ఐకాన్ అల్లు అర్జున్. ఇటీవల అల్లు అర్జున్ కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలు నిర్మోహాటంగా జనసేన అధినేత.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ & మెగాస్టార్ చిరంజీవి గురించే అని మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు..
టీడీపీ నేతలు.జనసేన నేతలు. అభిమానులు ప్రత్యేక్షంగానే కౌంటరిస్తున్నారు.. ఈ క్రమంలో అల్లు అర్జున్ కు వైసీపీ శ్రేణులు మద్ధతుగా నిలుస్తున్నారు. దివంగత సీనియర్ నటుడు అల్లు రామలింగయ్య లేకపోతే మెగా ఫ్యామిలీ ఎక్కడ..?. అని ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ అధినేత.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ మద్ధతు ఇస్తున్నట్లుగా అల్లు అర్జున్ తన స్నేహితుడు… వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కు మద్ధతు ఇస్తున్నారని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.