YSRCP మాజీ ఎమ్మెల్యే క్లారిటీ

 YSRCP మాజీ ఎమ్మెల్యే క్లారిటీ

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైస్సార్సీపీ కీ చెందిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటంసాని రాంభూపాల్ రెడ్డి కి సంబంధించిన అక్రమ నిర్మాణాలను ‘హైడ్రా’ కూల్చివేసిన సంగతి తెల్సిందే..

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో 25ఎకరాల్లో ఉన్న ఆయన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది అని ఏపీ అధికార టీడీపీ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ల్స్ చేశారు.. దీనిపై ఆయన స్పందిస్తూ హైడ్రా అధికారులు కూల్చిన భవనం తనది కాదని  తెలిపారు.

అసలు తనకు హైదరాబాద్ లో భవనాలే లేవన్నారు. కొందరు టీడీపీ నేతలు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తానే హైడ్రాకు నోటీసులు పంపిస్తానని మాజీ ఎమ్మెల్యే కాటసాని వెల్లడించారు.

మరోవైపు అమీన్ పూర్ పెద్దచెరువు FTLలో మాజీ ఎమ్మెల్యే కాటసాని అక్రమ నిర్మాణాలను కూల్చి, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశామని రంగనాథ్ తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *