సాక్షి పేపర్ పై దుమ్మేత్తిపోస్తున్న వైసీపీ క్యాడర్..?
చదవడానికి వింతగా..కొత్తగా ఉన్న కానీ ఇదే నిజం.. సాక్షి పేపర్ అయిన..టీవీ ఛానెల్ అయిన వైసీపీ కి పాజిటీవ్ గా..జగన్ సొంత ఆస్థాన మీడియాగా కీర్తి ఉంది. అలాంటి సాక్షి మీడియా పై వైసీపీ శ్రేణులు దుమ్మేత్తి ఎందుకు పోస్తున్నారు అని మీరు ఆలోచిస్తున్నారా..!
ఇవాళ అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ సీఎం..టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులైన ఎన్టీఆర్ వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా అధికార టీడీపీకి చెందిన నేత ఒకరూ మీడియాకు ప్రకటనలు ఇచ్చారు. అందులో భాగంగానే సాక్షి పేపర్ కి కోటి కి పైగా టీడీపీ సభ్యత్వాలు నమోదవ్వడంతో . భవిష్యత్తు ఆశాకిరణం లోకేష్ అంటూ ఆయన నేతృత్వంలో ఎన్టీఆర్ కి కోటి నివాళులు అని ఇటూ చంద్రబాబు అటూ ఎన్టీఆర్ ఫోటోలతో మెయిన్ పేపర్ ఫస్ట్ ఫేజీలో ఈ ప్రకటన ఇచ్చారు సదరు తెలుగు తమ్ముడు.
ఇదే వైసీపీ శ్రేణులకు కోపం తెప్పించింది..నార్మల్ గా మీడియా నియమనిబంధనలను పాటిస్తూ ప్రకటనను తీసుకుంటే మంచిగా ఉండేదేమో.. కానీ ఇక భవిష్యత్తు అంతా టీడీపీదే..భవిష్యత్తు సీఎం లోకేష్ అనే ఆర్ధం వచ్చేలా బాబు ఎల్లో మీడియా భజన చేసినట్లుగా సాక్షి పేపర్ ఉండటంతో వారు తీవ్ర అగ్రహానికి గురయ్యారు.. దీంతో సాక్షిపేపర్ లో వచ్చిన ఆ యాడ్ ను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు..మీరు ఓ లుక్ వేయండి.