వైఎస్సార్ నే లెక్క చేయలేదు.. జగన్ ఓ లెక్క…?

 వైఎస్సార్ నే లెక్క చేయలేదు.. జగన్ ఓ లెక్క…?

YSR FAMILY

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏదైన పట్టుపడితే ఎదుటివాళ్లు ఎవరైన సరే దాన్ని సాధించుకునేదాక వదిలిపెట్టని మొండిఘటం అని ఆమె తల్లి… దివంగత మాజీ సీఎం వైఎస్సార్ సతీమణి విజయమ్మ రాసిన ఓ బుక్ లో తెలిపారు. తాజాగా జగన్ తన ఇష్టపూర్వకంగా వైఎస్ షర్మిలకు ఆస్తుల్లో షేర్లు ఎంఓయూ చేస్తే వాటిని అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం అండదండలతో జగన్ ను ఆగమాగం చేయాలని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు.

అందుకే జగన్ తనతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్ధు చేసుకున్నారు అని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. అయితే ఒక వ్యక్తి తనకిష్టమైనప్పుడు మాత్రమే ఎంఓయూ చేసుకుంటాడు. తనకు నచ్చనప్పుడు దాన్ని రద్ధు చేసుకుంటాడు. కానీ వైఎస్ షర్మిల మాత్రం తనకు ఆ ఆస్తులు కావాల్సిందే.. షేర్లు కావాల్సిందే అంటూ జగన్ & బ్యాచ్ పై విమర్శల వర్షం ఎక్కుపెడుతుంది.ఈ సందర్భంగా షర్మిల తనకు కావాల్సిన దానికోసం ఎదుటివాళ్లను ఎంతగా ఇబ్బందుల పాలు చేస్తుంది..

తన పెళ్ళి గురించి అఖరికి తన తండ్రి అయిన వైఎస్సార్ ను ఎంతగా మానసిక క్షోభకు గురి చేసిందో తెలియజేసే ఓ సంఘటనను విజయమ్మ రాసిన “నాలో నాతో వైఎస్సార్” అనే బుక్ లోది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తనకు జన్మనిచ్చి ఈ లోకంలో ఓ గుర్తింపునిచ్చిన వైఎస్సార్నే లెక్క చేయలేదు.. తన అన్న జగన్ ఓ లెక్క .. ఇప్పటికైన షర్మిల గురించి తెలుసుకుని ఇలాంటి వాళ్ల నుండి దూరంగా ఉండాలి అని నెటిజన్లు సలహాలిస్తూ పోస్టులు పెడుతున్నారు. మీరు ఓ లుక్ వేయండి.. వైఎస్సార్ ను షర్మిల ఎంతగా మానసికంగా క్షోభ పెట్టారో వైఎస్ విజయమ్మ మాటల్లో..?

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *