పులివెందులలో వైఎస్ జగన్..!

YS Jagan in Pulivendula..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు సోమవారం పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని లింగాల మండలంలో శనివారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షం కురిసింది.
దీంతో రైతన్నకు చేతికొచ్చిన అరటి తోటలు నియోజకవర్గంలో నేలకొరిగాయి. ఈ క్రమంలో వాటిని పరిశీలించి రైతులను మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు.
ఇప్పటికే పులివెందుల చేరుకున్న జగన్ ఆదివారం రాత్రి జిల్లాలోని జడ్పీటీసీలతో సమావేశం అయ్యారు. ఈ నెల 27న జడ్పీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.