మొన్న మహేష్ కుమార్ గౌడ్.. నేడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి..?
మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కు చెందిన నేతలు ఎవరూ వచ్చి అడ్డుకుంటారు.. ఎవరూ వచ్చి బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటారో రండి. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో బుల్డోజర్లను నడిపిస్తాను.. మా సామేలు అన్నతో జెండా ఊపిస్తాను. ఎవరూ వస్తారో రండి.. హారీష్ రావు వస్తాడా..?. కేటీఆర్ వస్తాడా..?. మీ జాతి అంతా వచ్చిన బుల్డోజర్లతో తొక్కించి మరి మూసీ ప్రక్షాళన చేపడతాను అని అన్నారు.
మూసీ ప్రక్షాళన పాదయాత్ర ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటాము అని అంటున్నారు. ఎవరూ వస్తారో రండి.. అందర్ని బుల్డోజర్లతో తొక్కించి మరి మూసీ ప్రక్షాళన చేస్తాను అని అన్నారు.. నెలరోజులో మూసీ ప్రక్షాళన డిజైన్లు ఖరారు చేస్తాను.. పనులు మొదలెడతాను అని వ్యాఖ్యానించారు.
గతంలో ముఖ్యమంత్రి మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడుతూ మాజీ మంత్రులు కేటీఆర్ ,హారీష్ రావులు మూసీ ప్రక్షాళనకు అడ్డు వస్తామంటున్నారు. మేము వచ్చి అడ్డంగా పడుకుంటాము అని అంటున్నారు.. మా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖాళీగానే ఉన్నారు. మా మహేష్ అన్న బుల్డోజర్లు తోలతాడు.. మా హన్మంతన్న జెండా ఊపుతారు అని అన్నారు. ఒక విషయం గురించి ఎప్పుడు ఎక్కడ ఏమి మాట్లాడాడో కూడా తెల్వకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.