నేడు జనసేనలోకి వైసీపీ కీలక నేతలు

Former YSRCP MLAs Joins In Janasena
నేడు జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీకి చెందిన పలువురు కీలక.. మాజీ మంత్రులు జనసేన కండువా కప్పుకోనున్నారు.
ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యలు పవన్ సమక్షంలో జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. వీరందరికి పవన్ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించనున్నారు.
