యశస్వీ జైస్వాల్ రికార్డు
టీమిండియా జట్టుకు చెందిన యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ చరిత్రకెక్కాడు. ఏకంగా దిగ్గజాల సరసన నిలిచాడు. తొలి పది టెస్ట్ మ్యాచ్ ల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా జైస్వాల్ రికార్డును నెలకొల్పాడు.
బంగ్లాదేశ్ జట్టుతో చెన్నైలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో 1,094 పరుగులు చేసిన జైస్వాల్ మార్కు టేలర్ (1,088)ను ఆధిగమించాడు. ఈ జాబితాలో బ్రాడ్ మన్ (1,446) పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు.
తర్వాత స్థానంలో ఎవర్టన్ వీక్స్ (1,125 పరుగులు), జార్జ్ హెడ్లీ ( 1,102 పరుగులు) కొనసాగుతున్నారు. జైస్వాల్ ఈ మ్యాచ్ లో యాబై ఆరు పరుగులు చేసిన సంగతి తెల్సిందే.