ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ-కాంగ్రెస్ బీజేపీ ల మైత్రీపై సంచలన నిజాలు..
పార్లమెంట్ లో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి.బీజేపీ వైఖరిని తప్పుబడుతూ కాంగ్రేస్ పోరాటం చేస్తుంది.కేంద్రప్రభుత్వం ఆధానితో మోదీ దోస్తీపై కాంగ్రేస్ అగ్రనాయకులు రాహుల్ గాంది పోరాటం చేస్తున్నారు.మోదీకి వ్యతిరేఖంగా డిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రేస్ పోరాటాలు చేస్తుంది.బీజేపీ సైతం కాంగ్రేస్ పార్టీ విమర్శలను తిప్పికొడుతూ ఎత్తుకు పై ఎత్తు వేస్తుంది.కాంగ్రేస్ కౌంటర్ కు ఎన్ కౌంటర్ ఇస్తూ వస్తుంది.
అయితే ఇందుకు బిన్నంగా తెలంగాణ కాంగ్రేస్,బీజేపీల తీరు ఉంది.తెలంగాణలో ఆ రెండు జాతీయ పార్టీలు చాలా ప్రెండ్లీగా ముందుకు కదులుతున్నాయని జనాల్లో చర్చ సాగుతుంది.కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న సమస్యను సైతం ఒంటికాలిపై లేచి తెగ గోల చేసిన బీజేపీ బండి సంజయ్,బీజేపీ పార్టీ నేడు కాంగ్రేస్ ప్రభుత్వంలో తప్పుల మీద తప్పులు చేస్తున్నా నిమ్మకు నీరెత్తనట్టుగా ఉంటుంది.అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి,ప్రతిపక్ష బీఆర్ఎస్ పై విమర్శలు చేయడం అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.. ఇక ప్రభుత్వంలో ఉన్న కాంగ్రేస్ పార్టీ వైఖరి డిల్లీ కాంగ్రేస్ కు పూర్తి విరుద్దంగా ఉన్నాయి.కాంగ్రేస్ గతంలోనూ బీజేపీకి సహకరిస్తూ వచ్చింది.రాష్ట్రంలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో కాంగ్రేస్ ఆత్మహత్య చేసుకుని మరీ బీజేపీకి ప్రాణం పోసింది.డిల్లీలో రాహుల్ గాంది ఆదాని పై పోరాడితే తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి అతనితో ఒప్పందాలు కుదుర్చుకుంటాడు.తాజాగా ఏసీబీ స్థాయి కూడా లేని కేటీఆర్ పై కేసులో ఏకంగా ఈడి రంగంలోకి దిగడం చూస్తుంటే కాంగ్రేస్ బీజేపీ దోస్తీ ఊహాగానాలకు మరింత బలం చేకూరిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ మైత్రికి కారణం కూడా లేకపోలేదు.బీజేపీతో యుద్ద వాతావరణం ఎందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం.రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఉండటం,చంద్రబాబు సైతం కేంద్రంలో బీజేపీతో కలిసి ఉండటం,చంద్రబాబుకు రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడిగా ఉండటం వెరసి చంద్రబాబు ద్వారా కాంగ్రేస్ ను తెలంగాణలో బీజేపీ హ్యాండిల్ చేస్తుందని కొందరు వాదిస్తున్నారు..కాంగ్రేస్,బీజేపీలు ముందుగా ఉమ్మడి శత్రువు,ప్రాంతీయ పార్టీలను కనుమరుగు చేసే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలనే లక్ష్యంతో కలిసి పనిచేస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి..మరి ఈ దోస్తీ తో కాంగ్రేస్ బీజేపీలు లాభం పొందుతాయి.ప్రజా వ్యతిరేఖతను మూట గట్టుకుంటాయా వేచి చేడాల్సిందే.!!