కోటలు దాటిన మాటలు.. గడప దాటని రేవంత్ చేతలు..?

Words that crossed the forts.. but Revanth’s actions that crossed the threshold..?
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2025-26 ఏడాదిగానూ రూ.3,04,965 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ఉప ముఖ్యమంత్రి.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు నిన్న బుధవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. గత ఎన్నికల ప్రచారంలో అప్పటి పీసీసీ చీఫ్.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట విద్యా రంగానికి ప్రతి బడ్జెట్ లో 15% నిధులు కేటాయిస్తామని ఊకదంపుడు మాటలు చెప్పారు..
తీరా అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్రవేశ పెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ లో విద్యకు నిధులు కేటాయింపులో వివక్షతను చూపారు.. తాజాగా ఉప ముఖ్యమంత్రి భట్టీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి మంత్రిగా ఉన్న విద్యాశాఖకు బడ్జెట్‌లో గత ఏడాది కంటే తక్కువ కేటాయింపులు చేశారు..
రూ.304965 కోట్ల బడ్జెట్‌లో విద్యాశాఖకు కేటాయిం చింది రూ.23108 కోట్లు(7.57%) మాత్రమే..గతేడాది రూ.2,74,058 కోట్ల బడ్జెట్‌లో విద్యాశాఖకు కేటాయిం చింది రూ.21292 కోట్లు(7.77%)..గత సార్వత్రిక ఎన్నిక లకు ముందు బడ్జెట్‌లో 15% విద్యాశాఖకు కేటాయి స్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ తీరా అధి కారంలోకి వచ్చాక మాత్రం ఆ హామీని తుంగలో తొక్కి నట్లు అయింది…