ఫ్రీ బస్ పై కోమటిరెడ్డికి షాకిచ్చిన మహిళలు

Komatireddy Rajagopal Reddy Telangana Congress MLA
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై అధికార కాంగ్రెస్ కు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మహిళలు షాకిచ్చారు.
ఉచిత ప్రయాణంపై ఓ బస్సు ఎక్కిన ఎమ్మెల్యే కోమటిరెడ్డికి మహిళల నుండి ఊహించని స్పందన వచ్చింది. కోమటిరెడ్డి బస్సెక్కి ఫ్రీ బస్ సంతోషంగా ఉందా..?. టికెట్ డబ్బులు మిగులుతున్నాయి కదా అని మహిళలను అడిగారు.
దీనికి సమాధానంగా మహిళలు ” ఏం సంతోషం సార్.. మేమేమైనా రోజూ బస్సులో వెళతామా..?. ఎప్పుడో ఒకసారి వెళతాం .. టికెట్ తీసుకున్నవాళ్ళేమో నిలబడుతున్నారు. మేము మాత్రం కూర్చుంటున్నాం అని చెప్పారు.