ఉద్యమకారులకు బీఆర్ఎస్ తో న్యాయం జరుగుతుందా ..?- ఎడిటోరియల్ కాలమ్..!

Will BRS bring justice to the activists? – Editorial Column!
బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అంటే ఉద్యమ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఆవిర్భావించిన పార్టీ . దాదాపు పద్నాలుగేండ్ల పాటు అనేక ఉద్యమ పోరాటాలు చేసి అరవై ఏండ్ల నాలుగున్నర కోట్ల ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చింది. నెరవేర్చడమే కాకుండా రాష్ట్రమేర్పడిన తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి పదేండ్లలోనే యావత్ దేశమంతా తెలంగాణవైపు చూసేలా తీర్చిదిద్దిన పార్టీ. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే తాజాగా ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజ్ శ్రవణ్ పేరును ఖరారు చేశారు గులాబీ దళపతి కేసీఆర్.
దీంతో సోషల్ మీడియాలో.. రాజకీయ వర్గాల్లో ఉద్యమ కారులకు న్యాయం దక్కాలంటే అది కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యం అని చర్చ జరుగుతుంది. స్వరాష్ట్ర సాధనకై గల్లీలోని పోరడి దగ్గర నుండి ఢిల్లీలో ని బడా బడా నేత వరకు అందరూ తమ స్థాయిలో ఉద్యమాలు చేశారు. పోరాటాలు చేశారు.. జైళ్ళకెళ్లారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకులైన పెద్ది సుదర్శన్ రెడ్డి, బాల్క సుమన్ ,గాదరి కిశోర్ కుమార్, రసమయి, [పద్మాదేవేందర్ రెడ్డి లాంటి ఉద్యమ నేతలకు ఎంపీలుగా.. ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించింది బీఆర్ఎస్.. వాసుదేవ రెడ్డి, రాకేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ , మన్నె క్రిషాంక్ లాంటి యువ ఉద్యమ నాయకులకు కార్పోరేషన్ చైర్మన్ల తో పాటు పలువురికి అనేక విధాలుగా అవకాశాలు కల్పించింది.
తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పార్టీలో ఎంతో మంది సీనియర్ నేతలున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వకుండా హామీ తీసుకున్నవారున్నారు. అయిన కానీ వారందర్ని మెప్పించి ఉద్యమంలో తెలంగాణకై కొట్లాడిన దాసోజ్ శ్రవణ్ కు అవకాశం ఇచ్చారు గులాబీ దళపతి. అధికారంలో ఉన్నసమయంలోనే గవర్నర్ కోటాలో అవకాశం కల్పిస్తే అప్పటి గవర్నర్ వారి వారి రాజకీయ స్వార్ధం కోసం తిరస్కరించారు.
కానీ మళ్లీ ఎమ్మెల్సీగా రేపు పెద్దల సభకు వెళ్లనున్నారు దాసోజ్. దాసోజ్ శ్రవణ్ కు ఎమ్మెల్సీ ఇవ్వడంపై సర్వత్ర పొగడ్తల వర్షంతో పాటు ప్రశంసలు కురుస్తున్నాయి. ఉద్యమ కారులకు న్యాయం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీనే. కేసీఆర్ తోనే సాధ్యం అని వ్యాఖ్యానిస్తున్నారు. ఉద్యమ కారులందరికీ న్యాయం చేయలేకపోవచ్చు కానీ ఉద్యమ కారులకు న్యాయం చేస్తే మాత్రం అది ఒక్క బీఆర్ఎస్ పార్టీనే అని సర్వత్రా ప్రశంసిస్తున్నారు.
