25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్ అవుతారా…?

Telangana Congress
గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ లో వరుస వివాదాలు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. రుణమాఫీ అసంపూర్ణంగా ఉండడం రైతుబంధు విషయంలో కూడా సమస్యలు తలెత్తడం హామీల అమలులో జాప్యం జరుగుతుండడం,గ్రామసభల్లో ప్రజలనుంచి వచ్చిన వ్యతిరేకత, కులగణన, బీసీ రిజర్వేషన్ల పేర సర్వేలు నిర్వహించి ,మళ్లీ రి సర్వే అనడంతో బీసీల నుంచి తీవ్ర వ్యతిరేఖత ఏర్పడింది..
అయితే తాజాగా మరో వార్త కాంగ్రెస్ను కలవరాన్ని గుర్తిస్తుంది కాంగ్రెస్ కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బాంబు పేల్చారు.. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పై 25 మంది ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నారని, వారంతా కలిసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు..
రాహుల్ గాంధీ పర్యటన కూడా రేవంత్ రెడ్డి అడ్డుకున్నాడని ,ఆయన వస్తే ఇక్కడ తన వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయోనని,రాహుల్ గాంధీ తనను పక్కకు పెడతాడనే భయంతో రాహుల్ గాంధీని రాకుండా చేశారని ఆయన ఆరోపించాడు.. మరి ఆ 25 మంది ఎమ్మెల్యేలు ఎవరు..? నిజంగానే ఆయన వ్యాఖ్యలు నిజమ వుతాయా..? అది ఏదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..!!
