KCR ఎందుకు బయటకు రావడంలేదు..?

 KCR ఎందుకు బయటకు రావడంలేదు..?

KCR ఈ మూడక్షరాల పేరు విన్న పలికిన వచ్చే గూస్ బమ్స్ వేరే లెవల్ అని గులాబీ శ్రేణులు..ఆయన అభిమానులు చెప్పే మాట.. తింటే గారెలే తినాలి..వింటే చూస్తే కేసీఆర్ ప్రెస్మీట్ నే చూడాలి..ఆయన మాటలు వినాలి అని అంటుంటారు.. ఇక ఉద్యమ సమయంలోనైతే ఆయన ప్రసంగం.పంచ్ లు మాటలు తూటాలు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకెళ్లాయి.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా సీఎం స్థానంలో ఉండి కూడా మాటల్లో  కానీ చేతల్లో కానీ  ఆ పవర్ తగ్గనివ్వకుండా చేసిన అపర రాజకీయ చాణిక్యుడు.. లెజండరీ నాయకుడు కేసీఆర్..

అలాంటి కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత..ఎంపీ ఎన్నికల తర్వాత ఎందుకు మీడియా ముందుకు రావడంలేదు.. ప్రజాక్షేత్రంలోకి ఎందుకు రావడంలేదు.. కార్యకర్తలకు నేతలకు ఎందుకు భరోసానివ్వడం లేదు అని ఒకటే ప్రశ్నల వర్షం గులాబీ శ్రేణుల మదిలోనూ.. రాజకీయ విశ్లేషకుల మదిలో మెదులుతున్న అనుమానాలు.. ఒకప్పుడు ఆయన ప్రెస్మీట్ కోసం మాటల కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూసే వాళ్లు ఇప్పుడు కేసీఆర్ కన్పిస్తే చాలు..కేసీఆర్ ను కలిస్తే చాలు అని అనుకుంటున్నారు.. మరి కేసీఆర్ ఇంత జరుగుతున్న ఎందుకు బయటకు రావడంలేదు..? ఎందుకు ఆయన మౌనంగా ఉంటున్నారు..? ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మాజీ ఎంపీ..ఎమ్మెల్యేలు,నేతలను ఎర్రవెల్లిలోని తన ఫాం హౌజ్ కు పిలుపించుకుని మాట్లాడుతున్నారు తప్పా బహిరంగంగా ఎందుకు ఆయన రావడంలేదని ఇలా సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతున్నాయి..

సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజున బాత్రూం లో కిందపడి చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ ఎంపీ ఎన్నికలప్పుడు తెలంగాణ భవన్ కు రావడం..బస్సు యాత్ర పేరుతో ప్రజల్లో తిరగడం జరిగింది..కేసీఆర్ ఎక్కడకెళ్లిన కానీ ప్రజలు బ్రహ్మారథం పడుతూ ఘనస్వాగతం పలికారు.. పలు ప్రసంగాల్లో పదహారు సీట్లు ఇవ్వండి..పన్నెండు సీట్లు ఇవ్వండి రాబోయే రోజుల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతాయని పూసగుచ్చినట్లు ఎందుకు బీఆర్ఎస్ ను గెలిపించాలో కూడా వివరించారు కేసీఆర్. అయిన కానీ ఒక్కచోట కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించలేదు ప్రజలు.. గెలుస్తామని భావించిన సికింద్రాబాద్ మెదక్ నాగర్ కర్నూల్ మూడో స్థానానికి పరిమితం అవ్వడం కూడా గులాబీ శ్రేణులకు తీవ్ర మనోవేధనను మిగిలించింది.. ఇది చాలనట్టుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరుతున్నారు ..

ఒకపక్క ఓటమితో నైరాశ్యంలో కూరుకుపోయిన క్యాడర్ కు భరోసానివ్వకుండా.. ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న కేసీఆర్ బయటకు రాకపోవడానికి వెనక పెద్ద వ్యూహరచనే ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఎన్నికలు అయిన తర్వాత ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీలోకి వలసలు సర్వసాధారణం.. అప్పుడే నిఖార్సైన నిజాయితీగా పార్టీకోసం పని చేసేవాళ్లు.చేసినవాళ్లు..మిగులుతారు.పదవుల కోసం అధికారం కోసం వచ్చినవాళ్లు మాత్రమే పార్టీని వదిలివెళ్తారు అని రాజకీయాలపై అనుభవం ఉన్న ఎవరికైన ఆర్ధమయ్యే విషయం.. అయితే కేసీఆర్ మీడియా ముందుకు కానీ బయటకు రాకపోవడానికి కారణాల్లో ఇదోకటి .. తను బయటకు రాకపోయిన కానీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే..ఎంపీ..ఎమ్మెల్సీ..నేతలను ఫాం హౌజుకు పిలిపించుకుని ప్రస్తుత రాజకీయ చదరంగంలో అనుసరించాల్సిన మార్గాలపై..వ్యూహాల గురించి వారికి వివరిస్తున్నారు అని రాజకీయ విశ్లేషకుల టాక్.. మేధావి మౌనం చాలా ప్రమాదం..కేసీఆర్ మౌనం వెయ్యి అణుబాంబులతో సమానం అని నాటి నుండి నేటి వరకు ఉన్న నానుడి.. ఆయన ఇంతటి మౌనం వెనక  ప్రపంచం బద్ధలయ్యే ఏదో వ్యూహ రచన ఉంటుందని …ఈవారం రోజుల్లో అది ప్రపంచం ముందుకు తీసుకువస్తారని.. అది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గురించా.. కమిటీల గురించా.. పార్టీ పునర్నిర్మాణం గురించా అని తెలుస్తుంది.అందుకే కేసీఆర్ ఇంత జరుగుతున్నా మౌనంగా ఉంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.. చూడాలి మరి ఈ వారం రోజుల్లో కేసీఆర్ ఎలాంటి వ్యూహరచనలతో ప్రణాళికలతో ప్రజల ముందుకు రాబోతున్నారో…?

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *