రైతు భరోసా కి దరఖాస్తులు ఎందుకు..!
Politics : తెలంగాణ వ్యాప్తంగా అర్హులైన కోటి ముప్పై లక్షల ఎకరాలకు ఈ సంక్రాంతి పండక్కి రైతు భరోసా పైసలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీ ప్రాధమికంగా నిర్ణయం తీసుకుంది. రేపు శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిని ఆమోదించనున్నది. ఆ తర్వాత పండక్కి రైతన్నల ఖాతాల్లో నేరుగా పైసలు వేస్తామని ప్రభుత్వం సూత్రప్రాయంగా తెలిపింది.
అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే ప్రజాపాలనలో అభయ హాస్తం పేరుతో ఆరు గ్యారంటీలు దక్కాలంటే దరఖాస్తు చేసుకోవాలని గతంలో ప్రతి ఒక్కరి నుండి దరఖాస్తు స్వీకరించారు. తాజాగా రైతు భరోసా పథకం అమలు చేయాలంటే ఈ నెల ఐదో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంపై ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజాపాలనలో కోటి పది లక్షల మంది నుండి ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించారు. మరి అందులో క్లియర్ గా ఉంది కదా రైతు భరోసా గురించి.. మళ్లీ ఎందుకు దరఖాస్తులు .. రైతులను పక్కతోవ పట్టించడానికే ఈ నిర్ణయం.. గతంలో కేసీఆర్ పాలనలో పన్నెండు సార్లు రైతు బంధు డబ్బులు ఇచ్చారు. ఇటీవల కుల గణన చేశారు. అందులో ఉన్నాయి. వివరాలన్నీ మీ దగ్గర ఉన్నప్పుడు మళ్లీ రైతు భరోసాకు దరఖాస్తులు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.