తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు..?

vice president
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : భారత ఉపరాష్ట్రపతి జగదీప్ థన్కర్ తన పదవికీ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతోనే ఈ నిర్ణయం తాను తీసుకున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.
తన పదవీకాలంలో మద్ధతుగా నిలిచినందుకు రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి నరేందర్ మోదీకి జగదీప్ థన్కర్ ధన్యవాదాలు తెలిపారు. కాగా సరిగ్గా మూడేండ్ల కిందట అంటే ఆగస్టు 11, 2022లో ఆయన్ని ఉపరాష్ట్రపతిగా మోదీ సర్కారు ఎన్నుకుంది.తాజాగా జగదీప్ థన్కర్ రాజీనామాతో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరూ అనే అంశంపై చర్చ జరుగుతుంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, కేంద్ర మంత్రులైన రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డాలో ఒకరు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని సోషల్ మీడియాలో, నేషనల్ పాలిటిక్స్ లో చర్చ జరుగుతుంది. అయితే త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నిక ఉంటుందని రాజకీయ విశ్లేషకుల టాక్.