అసెంబ్లీలో ఎవరా యూజ్ లెస్ ఫెల్లో..?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడి వెడిగా సాగుతున్నాయి.ఒకవైపు శీతాకాలం చలి గర్జిస్తుంటే,శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వేడితో కూడిన చర్చలు జరుగుతున్నాయి.అదికారపక్ష,విపక్ష సభ్యుల మద్య మాటల యుద్దం తారా స్థాయికి చేరుకుంటుంది.కాంగ్రేస్ ఆరోపణలు,బీఆర్ఎస్ ఎదురుదాడి వెరసి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగితున్నాయి..
అధికారం పక్షం బీఆర్ఎస్ అప్పులు చేసిందంటూ వాదిస్తుంటే లేదు కాంగ్రేస్ అబద్దాలు చెబుతుందని బీఆర్ఎస్ తిప్పికొడుతుంది.ఈ వాదనలు ఇటుంచితే అసెంబ్లీ టైగర్ గా పేరుపొందిన మాజీమంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని తన ప్రసంగంతో గడగడలాడిస్తున్నారు.అనవసర విషయాలకు పోకుండా పూర్తి సబ్జెక్ట్ తో ప్రభుత్వ తీరును,తప్పులను ఎండగడుతున్నారు.ఆయన స్పీచ్ ను చూసి స్పీకర్ తో సహా అదికారపక్ష నాయకులు కూడా ఫిధా అవుతున్నారు.బీజేపీ ఎమ్మెల్యేలు ఐతే అలా చూస్తు ఉండిపోతున్నారు.
అయితే అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా హరీష్ రావు ప్రసంగిస్తుంటే అటునుండి ఎవరొ దొంగ అంటూ సంబోదించడంతో హరీశ్ రావు ఆగ్రహానికి గురై “ఎవడ్రా యూస్ లెస్ ఫెల్లో “” అంటూ వాఖ్యానించారు.దీంతో సభ ఒక్కసారిగా గందరగోళానికి గురైంది.అటునుండి శ్రీదర్ బాబు స్పందిస్తు దొంగ ఎవరన్నారో వినపడలేదు కానీ మీరన్న యూస్ లెస్ ఫెలో అనేది వినపడిందన్నారు..తర్వాత సభా సజావుగా సాగినప్పటికి యూజ్ లెస్ ఫెలో ఎవరనేదానికిపై జనంలో చర్చ మొదలైంది.మొన్న తాగి వస్తున్నారని,నిన్న యూస్ లెస్ ఫెల్లో అని అన్నది మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలలో ఎవర్నో ఒకర్ని అనే చర్చ జనంలో ఉంది.తరచూ హరీశ్ రావు ప్రసంగాలకు సంబందం లేకున్నా అడ్డుపడుతూ వెకిలి మాటలు మాట్లాడుతున్న కొమటిరెడ్డి బ్రదర్స్ కి హరీశ్ రావు చురకపెట్టి గట్టి కౌంటర్ ఇస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.