కివీస్ చేతిలో వైట్ వాష్?.. గుణపాఠం నేర్చుకుంటారా..?
కివీస్ జట్టు అది స్వదేశంలో టీమిండియాపై వైట్ వాష్ అంటే మాములు మాట కాదు. దాదాపు రెండు దశాబ్ధాలన్నర తర్వాత (24ఏండ్ల తర్వాత)ఓ విదేశీ జట్టు భారత్ గడ్డపై టీమిండియాను వైట్ వాష్ చేయడం ఓ చరిత్ర. సరిగ్గా ఇరవై నాలుగేండ్ల కిందట సౌతాఫ్రికా జట్టు టీమిండియాని 2000లో 2-0తో వైట్ వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రత్యర్థి జట్టు భారత్ పై ఇలాంటి విజయాన్ని నమోదు చేసింది. దీనికి పూర్తి కారణం బ్యాట్స్ మెన్ విఫలమవ్వడమే. టీమిండియా లెజండ్రీ ఆటగాడు గౌతమ్ గంభీర్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీమిండియా ఆడిన తొలి టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ కు గురి కావడంతో గౌతీ సారథ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క టెస్ట్ సిరీస్ తోనే గౌతీ సామార్థ్యాలను అంచనా వేయలేము.
కానీ స్వదేశంలో అది అలవాటైన పిచ్ లపై ఆడి ప్రత్యర్థి జట్టుకు సిరీస్ ను అప్పజెప్పడమే సగటు భారత్ క్రీడాభిమాని జీర్ణించుకోలేని పరిణామం. కివీస్ జట్టుతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓడినప్పుడు మొదటి మ్యాచ్ ను దేవుడికివ్వడం అలవాటేలే అని క్రీడా అభిమానులు సర్ధి చెప్పుకున్నారు. దాదాపు ముప్పై ఆరు ఏండ్ల తర్వాత ఓ విదేశీ జట్టు మొదటి మ్యాచ్ లో గెలవడం ఇదే ప్రధమం అయిన కానీ అభిమానులు టీమిండియా ఆటగాళ్లను వెనకేసుకోచ్చారు. తర్వాత మనకు అలవాటైన స్పిన్ పిచ్ లను తయారుచేసుకుని మరి రెండో మ్యాచ్ బరిలోకి దిగారు. అయిన తీరు మారలేదు. టీమిండియా కుర్రాళ్లకు మార్గదర్శకం .. అండగా నిలవాల్సిన సీనియర్ ఆటగాళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్ లల్లో చేతులెత్తేశారు. మిగతా ఆటగాళ్ల సంగతి అయితే మరిచిపోవడం ఉత్తమం.
ఈ మ్యాచ్ లో ఓటమితో దాదాపు పన్నెండు ఏండ్ల తర్వాత ఓ విదేశీ జట్టు సిరీస్ ను సొంతం చేసుకుంది. ఇకమూడో టెస్ట్ లో దెబ్బ తిన్న పులిలా దూకుతారనుకున్న టీమిండియా బ్యాటర్లు తమకేదో డ్రస్సెంగ్ రూమ్ లో ఏదో ముఖ్యమైన పని ఉన్నట్లు ఒకరి తర్వాత క్యూ కడుతూ ఔటయ్యి వెళ్లిపోయారు. దీంతో ఐదు రోజులు ఆడాల్సిన టెస్ట్ మ్యాచ్ లు కాస్తా మూడు రోజులకే ముగిసిపోయింది. దాదాపు ఇరవై నాలుగేండ్ల తర్వాత తొలిసారి టీమిండియా స్వదేశంలో వైట్ వాష్ కు గురైంది. విదేశాలకెళ్లి మన బ్యాటర్లు తేలిపోయారంటే అక్కడి పిచ్ లపై మనకు అనుభవం లేదులే అని సర్దిచెప్పుకోవచ్చు. కానీ స్వదేశీ పిచ్ లపై ఇంతటి ధారుణ పరిస్థితులను ఎదుర్కోవడంపై అందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైన ఉంది. మూడు టెస్ట్ మ్యాచ్ ల్లో బౌలర్లంతా తమకు అవకాశం దొరికినప్పుడల్లా తమ ప్రదర్శనను ప్రదర్శించారు.
బ్యాటర్లే అందరూ విఫలమయ్యారు. ఒకరిద్దరూ ముగ్గురు తప్పా తాము టెస్ట్ మ్యాచ్ కాదు టీ20 మ్యాచ్ ఆడుతున్న ఫీలింగ్ తో బ్యాటింగ్ కు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇప్పటికైన కివీస్ తో ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఎందుకంటే కివీస్ కంటే అత్యంత కఠినమైన జట్టు ఆసీస్. ఆ జట్టులో అందరూ ఫాస్ట్ బౌలర్లే.. వారిని వారి దేశంలో అడ్డుకోవడం అంటే మాములు మాట కాదు. ఇప్పటికైన సరే డ్రోమికల్ క్రికెట్ ఆడాలి.. వీలైనంతగా ప్రాక్టీస్ చేయాలి.. అన్ని విధాలుగా సన్నద్ధం కావాలి.. లేకపోతే కివీస్ చేతిలో వైట్ వాష్ కు గురైనట్లు ఆసీస్ చేతిలో వైట్ వాష్ కు గురవ్వాల్సి వస్తుంది. సో సీనియర్లు.. జూనియర్లను మమైకం చేస్తూ బీజీటీ లో గౌతీ ఎలా నడిపిస్తారో చూడాలి మరి..?