రేవంత్ సారూ ఏంటయ్యా మరి అంతా పీఆర్ స్టంట్ ..?

Revanth Reddy
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకుడి యొక్క ప్రతి అడుగును ప్రతోక్కరూ గమనిస్తారో లేదో కానీ ఓ ముఖ్యమంత్రిగా… మంత్రిగా.. ఎమ్మెల్యేగా.. ఎంపీగా ఉన్న నాయకుడి ప్రతి అడుగును క్షణంక్షణం గమనిస్తారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గడిచిన పది నెలల్లో చేసిన సంక్షేమాభివృద్ధి కంటే పబ్లిసిటీపై పెట్టిన ఖర్చే ఎక్కువ అని రాజకీయ వర్గాలతో పాటు విమర్శకుల టాక్.
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగ రోజు కొండారెడ్డిపల్లిలో పర్యటించి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలు ప్రస్తుతం నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఏ కార్యక్రమం అయిన ప్రారంభోత్సవమో.. శంకుస్థాపనో చేసినప్పుడు ఏర్పాటు చేసిన శిలఫలకాలపై పేర్లు పెట్టడం సహాజం..

కానీ దానికి విభిన్నంగా ముఖ్యమంత్రి పేరు పక్కన ఫోటో పెట్టడం..దాంతో పాటు స్థానిక అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఫోటోలు పెట్టడం ప్రస్తుతం వివాదస్పదంగా మారాయి.. అయితే ఆ ఫోటోలు ముఖ్యమంత్రి.. ఎమ్మెల్యేకు తెలిసే పెట్టారో లేదో కానీ నెటిజన్లు మాత్రం రేవంత్ సారూ మరి అంతా పీఆర్ స్టంట్ ఏంటయ్యా అని ట్రోల్స్ చేస్తున్నారు. మున్ముందు అయిన ఇలాంటి తప్పిదాలు జరగకుండా నెటిజన్ల చేతులకు చిక్కకుండా అధికారులు చొరవ తీసుకుంటారో లేదో మరి…?

