జైల్లో రాత్రంతా అల్లు అర్జున్ ఏమి చేశారంటే..?
ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ మహానగరంలోని సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఓ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనకు కారణం అని ఇటు సంధ్య థియోటర్ మేనేజర్, సెక్రూరిటీ సిబ్బందితో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లపై కేసు నమోదు చేసి జైలుకు పంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన కొన్ని అనివార్య కారణాలతో నిన్న శుక్రవారం రాత్రంతా జైల్లోనే అల్లుఅర్జున్ ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది.
జైల్లో ఉన్న ఖైదీలందరూ బ్యారక్లకు వెళ్లిన తర్వాత మంజీర బ్యారక్ కు బన్నీని తరలించారు. జైలు అధికారులు ఫుడ్ ఆఫర్ చేసినా కానీ బన్నీ తీసుకోలేదని సమాచారం. ఆయనకు కొత్త రగ్గు, దుప్పటి ఇవ్వగా సాధారణ ఖైదీలాగే నేల మీద పడుకున్నట్లు తెలుస్తోంది. 14రోజుల రిమాండ్ విధించినప్పుడు న్యాయాధికారి ఆయనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మర్నాడు మాత్రమే అందుతాయి.