శిష్యుడుపై వేటు ఒకే .. మరి గురువు సంగతేంటీ..?

What about the disciple.. and what about the teacher..?
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ పై ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు కింద సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెల్సిందే. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటమే కాకుండా ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే పత్రాలను చింపేయడం.. ఓ వర్గాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోని తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ జి చిన్నారెడ్డి పేరుతో ఓ లేఖను విడుదల చేసింది.
ఇంతవరకూ బాగానే ఉంది. మరి అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుండి ఇటు బీఆర్ఎస్ నేతలను అటు కేసీఆర్ ను ఓ ముఖ్యమంత్రి అయి ఉండి మరి తిట్టని తిట్లు తిడుతూ ఇటు పార్టీకి అటు ప్రభుత్వానికి తీవ్ర అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డిపై చర్యలుండవా అని ఇటు తీన్మార్ మల్లన్న అభిమానులు అటు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఏమి మాట్లాడిన ప్రజలు ఎక్కువగా పట్టించుకోరు.
ప్రతిపక్షంలో అలా మాట్లాడితే ఇటు ప్రజలకు అటు పార్టీ క్యాడర్ కు జోష్ వస్తుంది. కానీ అధికారంలోకి వచ్చాక తాను ప్రతిపక్షంలో ఉన్నట్లే ఉంటాను. కేసీఆర్ దగ్గర నుండి బీఆర్ఎస్ కు చెందిన చివరి కార్యకర్తను అందర్నీ తన నోటికి వచ్చినట్లు తిడతాను.. బూతులు మాట్లాడ్తాను అంటే అన్ని వేళాల అది ఇటు పార్టీకి అటు ప్రభుత్వానికి మంచిది కాదు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయమనే ప్రతిపక్షాలు కోరడమే ఆలస్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి ఆ పార్టీ అధికార ప్రతినిధుల వరకూ ఎంచుకునే రాగం బూతుల రాగం. దీని వల్ల అప్పటిమందం మీడియాలో అధికార పక్షం ట్రెండింగ్ వార్తవుతుంది తప్పా ఎలాంటి లాభం ఉండదు. ప్రజలు ఓ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే చూస్తారు. కానీ ప్రతిపక్షాన్ని తిడితే మాకు ఏంటి లాభం అని ఆలోచిస్తారు.
ఇలా అధికారంలో ఉన్న సమయంలో హామీలను అమలు చేయకుండా ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా గడిచిపోయి జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్నాలుగు నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీకి జరిగింది అదే. పదేండ్లలో బీఆర్ఎస్ పై వచ్చిన వ్యతిరేకత సీఎం రేవంత్ రెడ్డి తీరు వల్ల ఆ పార్టీకి పద్నాలుగు నెలల్లోనే వచ్చింది.
పల్లె నుండి హైదరాబాద్ గల్లీ వరకూ ఎవర్ని కదిలించిన రేవంత్ రెడ్డిని తిట్టినోళ్ళే తప్పా పొగిడినోళ్ళు ఎవరూ లేరు. అంతటి మహా చరిత్ర ఉన్న రేవంత్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయరు. ఎందుకు పార్టీకి అంతలా నష్టం చేకూర్చుస్తున్న మౌనంగా ఉంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై వేటు వేశారు. శిష్యుడుకో న్యాయం.. బూతులను మాట్లాడటంలో పీహెచ్ డీ చేసిన గురువుకో న్యాయమా అని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది.
