తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి బెదిరింపులు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేకి ఓ అగంతక వ్యక్తి నుండి బెదిరింపులు ఎదురయ్యాయి..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు ఓ అగంతక వ్యక్తి కాల్ చేశాడు..కాల్ చేసి తక్షణమే ఇరవై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు..
దీంతో ఎమ్మెల్యే సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు..కేసు నమోదు చేస్కున్న పోలీసులు సదరు వ్యక్తిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు..