ముద్దులు పెడితే బాకీ మాఫీ – అధికార పార్టీ నేత బంఫర్ ఆఫర్..!

Waiver of dues if kissing – Ruling party leader’s bumper offer..!
సహజంగా ఎవరైన మనకు బాకీ ఉంటే ఎప్పుడు ఎలా చెల్లిస్తారు..?. ఎన్ని రోజులకు చెల్లిస్తారు అని అడుగుతారు. కానీ తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ కు చెందిన ఓ నేత మాత్రం బాకీ చెల్లించాల్సిన అవసరం లేకుండా ఓ బంఫర్ ఆఫర్ ఇచ్చాడు. అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల అధికార కాంగ్రెస్ పార్టీ నేతపై లైంగిక వేధింపులు కేసును పోలీసులు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం కేశంపేటలోని ఓ ఉపాధ్యాయురాలు అధికార పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి కు చెందిన ఓ పాఠశాలను లీజుకు తీసుకున్నారు. కానీ కొన్ని పరిస్థితులు అనుకూలించక రెండేండ్లకే ఆ ఒప్పందాన్ని రద్ధు చేసుకున్నారు.ఈ క్రమంలో స్కూల్ కు చేసిన కొన్ని మరమ్మత్తుల నిమిత్తం సదరు ఉపాధ్యాయురాలు శ్రీకాంత్ రెడ్డికి కొంతమొత్తంలో బాకీ ఉన్నారు.
ఆ బాకీ చెల్లించాలని తరచూ కాల్ చేస్తుండేవాడు. ప్రస్తుతం తన దగ్గర లేవని.. కొంత కాలం ఆగాలని చెప్పేసింది. దీంతో సదరు నేత బాకీ మాఫీ కావాలంటే తనకు ముద్దులు పెడితే సరిపోతుందని అసభ్యకరంగా పలుమార్లు ఆ ఉపాధ్యాయురాలిని వేధిస్తూ ఉండేవాడు.దీంతో ఆ మహిళ పీఎస్ లో పిర్యాదు చేయగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.
