డైవర్స్ బాటలో డాషింగ్ ఓపెనర్..
భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.క్రికెట్ లో తను ఒక సంచలనం.సెహ్వాగ్ క్రీజ్ లో ఉన్నాడంటే ప్రత్యర్థులకు చుక్కలే..అతని బ్యాటింగ్ కి ఇప్పటికి సెఫరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.అయితే తన ఫ్యామిలి లైఫ్ లో వీరూ ఇబ్బందులుపడుతున్నట్టు తెలుస్తుంది..తన భార్యతో వీరూ విడాకులు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఆర్తి అహ్లావత్‌తో 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సెహ్వాగ్ సిద్దమైనట్లు ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది.ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో పాటు కొన్ని నెలలుగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. 2004లో ఈ ఇద్దరికి పెళ్లికి కాగా ఇద్దరు కుమారులున్నాయి..ఆర్తి అహ్లావత్‌తో గొడవల నేపథ్యంలోనే వీరేంద్ర సెహ్వాగ్ దేవాలయాలను సందర్శించాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఇటీవల సెహ్వాగ్ తిరుపతితో పాటు సౌతిండియాలో పలు దేవాలయాలను ఒంటరిగా సందర్శించాడు. గత దీపావళి రోజు కూడా ఒంటరిగా ఉన్న ఫొటోలను షేర్ చేశాడు.20 ఏండ్ల తర్వాత సేహ్వాగ్ విడాకులు తీసుకోవటంపై తన అభిమానులు భాదపడుతున్నారు.