విరాట్ కోహ్లీ రికార్డు…!

Virat Kohli Indian cricketer
ఐపీఎల్ -2025 సీజన్ లో భాగంగా ఈరోజు సోమవారం ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.టీ20ల్లో 13,000పరుగులను పూర్తి చేసుకున్న తొలి టీమిండియా ఆటగాడిగా నిలిచారు.
ముంబై బౌలర్ బౌల్ట్ బౌలింగ్ లో వరుస ఫోర్లతో కోహ్లీ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. మొత్తం 386ఇన్నింగ్స్ లో ఈ రికార్డును సాధించాడు.
కోహ్లీ కంటే ముందు పోలార్డ్ (13,537),శోయబ్ మాలిక్ (13,557), హేల్స్ (13,610) పరుగులతో టాప్ లో ఉన్నారు. మొదటి స్థానంలో సిక్సర్ల వీరుడు క్రిస్ గేల్ (381 ఇన్నింగ్స్ లో 14,562 పరుగులు) ఉన్నాడు.
