విరాట్ కోహ్లీ మరో రికార్డు

Virat Kohli Indian Cricketor
రన్ మెషీన్‌గా, రికార్డుల రారాజుగా పేరొందిన టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అధిగమించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 9వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. చిన్నస్వామి స్టేడియంలో క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
బౌండరీలతో చెలరేగి 31వ టెస్టు ఫిఫ్టీ బాదేసిన విరాట్ 9 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు.న్యూజిలాండ్ బౌలర్ విలియం ఓర్కీ బౌలింగ్‌లో మిడాన్ దిశగా సింగిల్ తీసిన కోహ్లీ 53 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఘనతకు చేరువయ్యాడు.
దాంతో, ఈ ఫీట్ సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా క్రికెటర్‌గా రికార్డు పుస్తకాల్లో చేరాడు. కోహ్లీ కంటే ముందు దిగ్గజాలు సచిన్ టెండూల్కర్(15,921), రాహుల్ ద్రవిడ్(13,265), సునీల్ గవాస్కర్(10,212)లు ఈ మైలురాయిని అధిగమించారు.