కోహ్లీ మరో మైలురాయి..?

టీమిండియా మాజీ కెప్టెన్..లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డే క్రికెటులో మరో మైలురాయిని చేరుకున్నారు. వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా (287 ఇన్నింగ్సులు) 14వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్ గా రికార్డులకెక్కారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 350 ఇన్నింగ్సులు, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 378 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత అందుకున్నారు.
మొత్తంగా 14వేల పరుగులు పూర్తి చేసిన మూడో ప్లేయర్ కింగ్ కావడం గమనార్హం. కోహ్లి కన్నా ముందు సచిన్ (18,426), సంగక్కర (14,234) ఉన్నారు.
