ఆ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ మూవీ..?

 ఆ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ మూవీ..?

Vijay Devarakonda

Loading

పెళ్లి చూపులు చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం.. ఒకవైపు బాక్సాఫీసు కలెక్షన్లతో పాటు జాతీయ అవార్డులను సైతం దక్కించుకున్న మూవీ ఇది. విజయ్ దేవరకొండ హీరోగా.. రీతూ వర్మ హీరోయిన్ గా నటించారు.

తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తర్వాత వీరిద్దరూ బిజీబిజీ అయ్యారు. ఆ తర్వాత వీరు కలిసి తీసిన చిత్రం లేదు. తాజాగా వీరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.

ఇప్పటికే రౌడీ ఫెలో కి దర్శకుడు తరుణ్ భాస్కర్ కథ విన్పించాడు. ఆ కథ నచ్చి విజయ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడంట.ఇప్పటి వరకు చిన్న సినిమాలే చేసిన తరుణ్ భాస్కర్ తాజా మూవీతో పెద్ద సినిమాలు చేసే స్థాయికి ఎదగనున్నారు .

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *