వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు.. సీనియర్ మాజీ రాజ్యసభ సభ్యులు వి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ” ఓబీసీ కన్వీనర్ గా అవకాశమిస్తే దేశమంతా తిరుగుతాను. పార్టీ బలోపేతం గురించి పని చేస్తాను. నేను రాహుల్ గాంధీ,సోనియా గాంధీలకు విధేయుడ్ని. వారికోసం ఎంత దూరమైన వెళ్తాను.. ఏ బాధ్యత అప్పజెప్పిన కానీ దానికి పూర్తి న్యాయం చేస్తాను.
నాకు రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ వచ్చిన్ కానీ నేను తీసుకోలేదు. నాకు పదవులు ముఖ్యం కాదు. పార్టీ ముఖ్యం.ఓబీసీ కన్వీనర్ గా అవకాశమిస్తే దేశంలో ఎక్కడ అన్యాయం జరిగిన అక్కడకు వెళ్ళి పోరాడాతాను. ఓబీసీ ఎంపీల పోరం కన్వీనర్ గా ఉండి ఐఐటీ ఐఐఎం లలో రిజర్వేషన్లను తీసుకోచ్చాను.. ఇప్పుడు చాలా మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందుతున్నారు.
ఇటీవల ఏఐసీసీ సమీక్ష సమావేశంలో రాహుల్ గాంధీ,సోనియా గాంధీ,మల్లిఖార్జున ఖర్గే లు కులగణన చేయాలని సూచించారు. 1931లో కులగణన జరిగింది. ఇప్పటివరకు జరగలేదు. బీజేపీ తప్పా అన్ని పార్టీలు కులగణనకు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా బడ్జెట్లో నూట యాబై కోట్ల రూపాయలను కేటాయించారని “ఆయన అన్నారు.