గోట్ ను దాటలేకపోయిన వేట్టయన్

Goat VS Vettayan
3 total views , 1 views today
దళపతి విజయ్ నటించిన గోట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మొదటి రోజు కలెక్షన్లను సైతం దాటలేకపోయిన సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయన్ మూవీ.. గోట్ విడుదలైన తొలిరోజు ప్లాప్ టాక్ తో మొదలైన కానీ నూట ఇరవై కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.
తాజాగా టీజీ జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో వచ్చిన వేట్టయన్ మూవీ మొదటి రోజు కేవలం డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు సినీ క్రిటిక్స్ చెబుతున్నారు.
గోట్ మూవీ కలెక్షన్లు పెరగడానికి ప్రధాన కారణం టికెట్ల ధరలను నార్మల్ ధరలకంటే ఇరవై నుండి ముప్పై శాతం పెంచారని సూపర్ స్టార్ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు.ఫస్ట్ డే గోట్ పై ఉన్న నెగిటీవ్ టాక్ వేట్టయన్ పై లేదు. దీంతో వేట్టయన్ మూవీ మొదటి వారం రోజుల్లో గోట్ కలెక్షన్లను దాటోచ్చు అని టాక్.
