రక్తదానంతో లాభాలెన్నో..?
కొన్ని రకాల ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కొందరికి రక్తం అవసరమవుతుంది. ఆ సమయంలో అవసరమైన బ్లడ్ గ్రూప్ రక్తాన్ని అందిస్తే వారి ప్రాణాలను కాపాడవచ్చు.
- క్రమం తప్పకుండా రక్తదానం చేస్తే, శరీరంలో ఐరన్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. రక్తంలో అధిక స్థాయిలో ఐరన్ ఉంటే రక్త ప్రసరణలో అడ్డంకులు ఎదురవుతాయి. గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. హెమోక్రోమాటోసిస్ (ఐరన్ ఓవర్ లోడ్) అనే వ్యాధికి కారణమవుతుంది. రక్తదానం చేయడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి.
- శరీరంలో ఐరన్ నిల్వల స్థాయి తగ్గడం వల్ల క్యాన్సర్ సోకే ప్రమాదం తక్కువ. ముఖ్యంగా పెద్దపేగు, కాలేయం, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది.
- రక్తదానం చేసినప్పుడు రక్త స్థాయి సమతుల్యం అవుతుంది. తద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
- శరీరంలో రక్త కణాల్లో కొలెస్ట్రాల్ నిల్వ ఉంటుంది. ఎర్ర రక్తకణాల్లో చెడు, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి రక్తదానం చాలా దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
- రక్తదానం వల్ల రోగ నిరోధకశక్తి కూడా పెరుగుతుంది.